Bye Bye modi Posters : మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు.. తెలంగాణలో కొత్త రచ్చ.!
నరేంద్రమోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ తెలంగాణ అంతటా పోస్టర్లు వెలిశాయి. దేశంలో బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు తలెత్తాయని, ఆనాడు స్వాతంత్ర సమరయోధులను అణచివేసిన బ్రిటిష్ పాలకులు, నేడు ప్రతిపక్ష పార్టీలను అణగతొక్కుతున్న బీజేపీ పాలకులు అంటూ పోస్టర్లలో విమర్శనాత్మక కామెంట్లు.

Bye Bye modi Posters in telangana brs fight against central govt
నరేంద్రమోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ తెలంగాణ అంతటా పోస్టర్లు వెలిశాయి. దేశంలో బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు తలెత్తాయని, ఆనాడు స్వాతంత్ర సమరయోధులను అణచివేసిన బ్రిటిష్ పాలకులు, నేడు ప్రతిపక్ష పార్టీలను అణగతొక్కుతున్న బీజేపీ పాలకులు అంటూ పోస్టర్లలో విమర్శనాత్మక కామెంట్లు. అందరిని ఆకట్టుకుంటున్నఆ ఆసక్తికరమైన పోస్టర్లలో
బ్రిటిష్ జెండాతో మహాత్మా గాంధీజీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల ముఖాన్ని కప్పుతూ చిత్రాలు. అలాగే ప్రస్తుతం కాషాయ రంగు ఉన్న చేయి అపోజిషన్ పార్టీల నేతల నోటికి అడ్డంగా పెట్టిన చిత్రాలు. చివరగా "ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది మహాత్మా కాపాడు.." అంటూ ఏక వాక్యం. కొసమెరుపు బై బై మోదీ.!
