ఎనిమిదేండ్లుగా నిర్మాణ రంగంలోనే ఉన్న వేణుగోపాల్ రెడ్డి.

ఎనిమిదేండ్లుగా నిర్మాణ రంగంలోనే ఉన్న వేణుగోపాల్ రెడ్డి. ఏడాదిగా రియల్ ఎస్టేట్ పడిపోయి.. బ్యాంకు రుణాలు, అప్పులు-ఒత్తిడి పెరగడంతో బలవన్మరణం. మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో నివాసముంటున్న ముత్యాల వేణుగోపాల్ రెడ్డి (39) అనే బిల్డర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్ల క్రితం గుండ్లపోచంపల్లిలో 480 చదరపు గజాల విస్తీర్ణంలో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణం వేణుగోపాల్ రెడ్డి మొదలుపెట్టారు.. ఇందుకు పలు బ్యాంకుల నుంచి, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు. అపార్ట్‌మెంట్లో పది ఫ్లాట్లు అమ్మితే అప్పులన్నీ తీరడంతో పాటు ఆర్థికంగా లాభపడతానని ఆశించారు.. కానీ ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నా మూడు ఫ్లాట్లు మాత్రమే బుక్ అయ్యాయి దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి మరింత పెరిగి తన అపార్ట్‌మెంట్ నిర్మాణం వద్ద ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలోనే వేణుగోపాల్ రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ehatv

ehatv

Next Story