బీఎస్పీ (BSP) పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Rs Praveen Kuma) ను ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు..

R.S Praveen Kumma
బీఎస్పీ (BSP) పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Rs Praveen Kumar) ను ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు.. హైదరాబాద్ సరూర్ నగర్ లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) ఈ కీలకప్రకటన చేసారు.
కేసీఆర్ ప్రభుత్వ పాలనను, పదకాలలో అవినీతిపై నిప్పులు చెరిగారు. బీఎస్పీ తీసుకొచ్చిన పథకాలనే కేసీఆర్ కాపీ కొట్టిన కానీ వాటిని సరైన తీరులో అమలు చేయడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఎస్పీ అధికారం సాదిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సరిగ్గా పాలించలేని కేసీఆర్ ఇంక దేశ రాజకీయాల్లో ఏం రాణిస్తారని వ్యాఖ్యానించారు.
