ఎన్నికలు(Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తన స్టైల్‌ మారుస్తున్నారు. ఈ ఎన్నికల్లో వినూత్న ప్రచారనికి కేటీఆర్(KTR) తెరలేపారు. ఎక్కువగా జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బహిరంగసభలు(Publi Meeting), సమావేశాలు, రోడ్‌షోలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రముఖులను తానే ఇంటర్వ్యూ చేస్తూ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఎన్నికలు(Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తన స్టైల్‌ మారుస్తున్నారు. ఈ ఎన్నికల్లో వినూత్న ప్రచారనికి కేటీఆర్(KTR) తెరలేపారు. ఎక్కువగా జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బహిరంగసభలు(Publi Meeting), సమావేశాలు, రోడ్‌షోలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రముఖులను తానే ఇంటర్వ్యూ చేస్తూ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రొ.నాగేశ్వర్, లోక్‌సత్తా జయప్రకాష్‌నారాయణ, గోరటి వెంకన్నలను తానే ఇంటర్వ్యూ చేశారు, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై వారినే ఉల్టా ప్రశ్నలడగడం చూస్తున్నాం. బిగ్‌బాస్‌(Bigg Boss) కంటెస్టెంట్‌ గంగవ్వకు(Gangavva) చెందిన మై విలేజ్‌ షోలో(My Village show) కూడా పాల్గొని వెరైటీ ప్రచారం చేసుకున్నారు. ఈ మధ్యనే నిలోఫర్‌ కేఫ్‌కు వెళ్లి అక్కడ ఉన్న పలువురు కస్టమర్లతో ముచ్చటించారు.

అయితే తాజాగా గత రాత్రి పాతబస్తీ(Old city) మదీనా(Madina) చౌరస్తాలో ఉన్న షాబాద్‌ హోటల్‌కు(Shahbad Hotel) ఎలాంటి ప్రొటోకాల్‌ లేకుండా సాదాసీదాగా వెళ్లారు. తన వెంట ఒకరిద్దరు నేతలు మాత్రమే ఉన్నారు. సాధారణ పౌరుడిలా బిర్యానీ(Biryani) ఆర్డర్‌ ఇచ్చారు. తొలుత కేటీఆర్‌ రాకను హోటల్‌ సిబ్బంది, కస్టమర్లు గుర్తించలేదు. తర్వాత అక్కడ కేటీఆర్‌ను చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఇంకేముంది అక్కడ ఉన్నవారంతా హడావిడి చేశారు. కేటీఆర్‌తో మాట్లాడేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో హోటల్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఇదే సందర్భంలో ప్రభుత్వ పని తీరుపై వారిని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ను ఇంకా ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై అభిప్రాయాలు తీసుకున్నారు. కేటీఆర్‌కు పలు రకాల వంటకాలు వడ్డించారు హోటల్‌ నిర్వాహకులు. హోటల్‌ నుంచి బయటకొచ్చే సమయంలో వందల సంఖ్యలో కేటీఆర్‌ను కలిసేందుకు ఎగబడ్డారు. ఆ తర్వాత మొజంజాహీ మార్కెట్‌కు వచ్చి ఐస్‌క్రీమ్‌ తిని తిరుగుప్రయాణమయ్యారు.

Updated On 18 Nov 2023 5:57 AM GMT
Ehatv

Ehatv

Next Story