గ్రూప్-1 అభ్యర్థుల(Group-1 candidates) ఆందోళన రాజకీయరంగు పులుముకుంది.
గ్రూప్-1 అభ్యర్థుల(Group-1 candidates) ఆందోళన రాజకీయరంగు పులుముకుంది. గ్రూప్-1 అభ్యర్థుల చలో సెక్రటేరియెట్ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మద్దతు పలుకుతూ ర్యాలీలో(Rally) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్‌ఎస్(BRS) నేతలు, కార్యకర్తలను బీజేపీ(BJP) శ్రేణులు అడ్డుకున్నాయి. నిరుద్యోగుల ర్యాలీలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్ నేతలకు అర్హత లేదని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరం నెలకొంది. బీజేపీ వైఖరిని మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఖండించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో బీజేపీ తీరును ఎండగట్టారు. ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేస్తూ.. 'మా సీనియర్ నాయకుల బృందాన్ని అడ్డుకుని దాడి చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తల దారుణమైన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు ఖండిస్తున్నాం. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రొ.దాసోజు శ్రావణ్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను అడ్డుకున్నవారిని ఖండిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.