తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ చిట్ చాట్‌ నిర్వహించారు. చిట్‌ చాట్‌ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ చిట్ చాట్‌ నిర్వహించారు. చిట్‌ చాట్‌ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పసలేని కేసులు పనికిమాలిన కేసులను ప్రభుత్వం పెడుతోంది. అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెట్టినా ఎదుర్కొంటాం

నేను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా... ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్న అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని చెప్పారు. అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రిని అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసిన ఫోటో బయట పెట్టడంతో అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

సస్పెండ్ చేస్తాను.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నాడు. మరి ఫార్ములా ఈ వాళ్లతో కలిసిన రేవంత్ రెడ్డి వాళ్లపై ఎందుకు కేసు పెట్టలేదు. వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు దాచి ఉంచాడు.. వాళ్లతో డబ్బులు తీసుకున్నాడని అనుమానం ఉంది

అనుచిత లబ్ధి పొందింది ఫార్ములా ఈ సంస్ధ వాస్తవమైతే వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు. ముఖ్యమంత్రి 600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అతనితో కాంట్రాక్టును రద్దు చేసుకోలేము అని చెబుతున్న ముఖ్యమంత్రి ఫార్ములా ఈ ని ఏ విధంగా రద్దు చేసుకున్నాడు

దీనికి ఏమన్నా క్యాబినెట్ అప్రూవల్ ఉందా.. ప్రొసీజర్ పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్లాలి కానీ అవినీతి కేసులు అని పెట్టడం వృధా. హైదరాబాద్ పేరు ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు వెళ్లిపోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టాం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా అవకాశమే లేదు. ఒక పైసా అవినీతి జరగలేదు కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం లో మరిన్ని విషయాలు చెప్పలేను. ఏసిబీ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయలని హైకోర్టులో కేసు నమోదు చేశా. అయితే ఇదే అంశంపై ఏసీబీ(ACB) ఆధారంగా కేసు నమోదు చేసింది. నోటీసులు వచ్చిన మాట వాస్తవమే... కానీ ఈ ఎఫ్ఐఆర్(FIR) హైకోర్టు కొట్టివేస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడి దూకుడుగా వ్యవహరిస్తుందా.... ఏం జరుగుతుందన్నది చూడాలి. ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆరోపణ చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఔటర్ రింగ్ రోడ్ రిలీజ్ రద్దు చేయాలి. అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు ప్రభుత్వం లీజును ఎందుకు రద్దు చేయట్లేదు ముఖ్యమంత్రి చెప్పాలి. నాపై ఇప్పటికే అనేక కేసులను రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసింది. రేవంత్ రెడ్డి(Revanth reddy) ఇప్పటికే అనేకసార్లు వివిధ రకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేసిండు. అనేక రకాల అంశాలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఈ మొత్తం వ్యవహారంలో నాకు డబ్బులు ఎట్లా వచ్చినయో చెప్పాలి. అనుమానాలపైన కేసులు ఉండవు కేవలం ఆధారాలపైన మాత్రమే కేసులు ఉంటాయి. రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్దాలను అసత్యాలను మీడియా యధాతధంగా ప్రచురితం చేస్తుంది. అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్న నీచపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర అప్పుల పైన ఒక్కొక్క అబద్ధాన్ని అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కాదు రేవంత్ రెడ్డి తాతకు కూడా భయపడను.

సంవత్సర కాలం పాటు ప్రతికూల రాజకీయ పరిస్థితులు ఉన్న ఒక్క సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగాము. మా పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని, ముఖ్యంగా రుణమాఫీ రైతు భరోసాను ప్రజలకు ఇవ్వలేకపోయమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలను మోసగించే కుట్రలతోనే నూతన సంవత్సరాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌కుఎందుకు ఓటు వేయద్దని నిరూపించింది. ఒకవైపు రైతు భరోసాను ఎగ్గొట్టి.. బీసీలను మోసపుచ్చడం అనే రెండు ప్రయత్నాలతో నూతన సంవత్సరాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరాని ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలు... గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి శాపాలై చుట్టుకున్నాయి. రైతు భరోసా ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టికొట్టింది. 26 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా రైతులకు బాకీ పడింది. ఎవరికి రైతు భరోసా ఇస్తారు అనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఎవరు పంట వేస్తున్నారు ఎవరు గుర్తుపట్టి రికార్డులకెక్కిస్తారు. 72,000 కోట్లు సాఫీగా రైతుల ఖాతాలోకి పోయిన కార్యక్రమాన్ని గందరగోళంగా మారుస్తున్నది. అంతిమంగా ఈ వ్యవహారం అవినీతికి దారి తీస్తుంది. ఓకే కాలం పంట వేసే రైతులకు, దీర్ఘకాలిక పంటలు వేసే రైతులకు పోడు భూములు సాగు చేసుకునే గిరిజనులకు రైతు భరోసా ఎగ్గొట్టే కుట్ర. బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతుంది. కోర్టు కేసులపేరు చెప్పి బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఆపే ప్రయత్నం చేస్తుంది. స్వర్గీయ మన్మోహన్ సింగ్ నివాళి కోసం సంతాపం కోసం ఏర్పాటుచేసిన తీర్మానాన్ని సమర్థించాం. అదే విధంగా తెలంగాణ బిడ్డ ప్రధాని పీవీకి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాం. ఢిల్లీలో పివి గారికి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని భారతరత్న ఇవ్వాలని గతంలో భారత రాష్ట్ర సమితి తీర్మానం

డిస్టక్షన్, డిస్ట్రక్షన్, డైవర్షన్ (3D) ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ నినాదం. హైడ్రా పేరుతో విధ్వంసం… అటెన్షన్ డైవర్షన్ ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. మా ప్రభుత్వానికి నీళ్లు, నిధులు, నియామకాలు అని నినాదం ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ త్రీ డి ఫార్ములా ఉంది. ఈ త్రీడీ ఫార్ములాని అమలు చేస్తుంది కేడి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా అల్లుడి కోసం అన్నదమ్ముల కోసం బావమరిది కోసం పనిచేస్తున్నాడు. ప్రజలపై, సోషల్ మీడియా కార్యకర్తలపై, ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడానికే ఈ ప్రభుత్వం సంవత్సర కాలాన్ని గడిపింది. కాంగ్రెస్ పార్టీ అవినీతిని అరాచకాలను ఢిల్లీ సాక్షిగా ఎండగట్టాం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సివిల్ సప్లై కుంభకోణం అమృత్ టెండర్ల కుంభకోణం మంత్రులపై పొంగులేటి పై జరిగిన ఈడి దాడి వంటి అంశాల నుంచి బిజెపి ప్రభుత్వం ఒక రక్షణ కాపాడుతుంది. కచ్చితంగా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డికి రక్షణ గోడలెక్క నిలబడ్డారు. పొంగులేటి ఇంటి పైన జరిగిన ఈడి దాడుల పైన ఎందుకు స్పందించలేదనే రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కార్యక్రమాల్లో బిజెపి పార్థ పరోక్షంగా ఉన్నదని అర్థమవుతుంది.

2025 సంవత్సరంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీ శిక్షణ కార్యకలాపాలను, సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతాం. ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది. గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని స్టైల్ లో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల అంశంలో పార్టీగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాష్ట్రస్థాయిలో కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. RRR గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. అప్పటి ప్రభుత్వమే క్యాబినెట్లో ఆమోదం కూడా తెలిపింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక చేసింది ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా సంవత్సరంలో లక్ష 39 వేల కోట్ల ఆప్పు ఎందుకు చేసింది. ఒక్క కార్యక్రమం చేపట్టకుండా ఈ అప్పులన్నీ ఢిల్లీకి పంపిస్తున్నారు. ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరంలో ఇంత పెద్ద అప్పు చేయడం దేశంలోనే రికార్డ్

కొంత ప్రచారం కావాలి, ప్రజా సమస్యల పై నుంచి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే సినిమా వాళ్లపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలి. చనిపోయిన వాళ్ల కుటుంబాలు కాదు.. మనుషులు కాదు అన్నట్టు.. సినిమా వాళ్లపై పడి అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారు. సినిమా వాళ్ల నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నాడు. సినిమా వాళ్ళతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాలపై స్పందించాలి. వీళ్ళకి కూడా కనీసం 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి' అని కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్ చేశారు.

ehatv

ehatv

Next Story