త్వరలోనే కేటీఆర్(KTR) తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నట్లు తెలిసింది.
త్వరలోనే కేటీఆర్(KTR) తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నట్లు తెలిసింది. ఆయన ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్(ASKKTR) అంటూ ఓ కార్యక్రమం నిర్వహించగా ఇందులో పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని భాతర రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President) కేటీఆర్ తెలిపారు. దీపావళిరోజు నెటిజన్లతో జరిగిన సామాజిక మాద్యమం ఎక్స్‌లో కేటీఆర్ తెలిపారు. పలువురు ప్రత్యేకంగా ఈ అంశంలో కేటీఆర్ అభిప్రాయాన్ని కోరారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అద్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, మీరేప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కెటిఅర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.
అయితే పాదయాత్ర అనగా గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. 2004 ఎన్నికలకు ముందు ఆయన నిర్వహించిన పాదయాత్ర ఉమ్మడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ పాదయాత్ర ఆయనకు కలిసి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రయ్యారు. తద్వార పలు ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రయ్యారు. కాంగ్రెస్(congress) అధిష్టానాన్ని ధిక్కరించి జగన్ వైసీపీని నెలకొల్పిన తర్వాత షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత 2014 తర్వాత జగన్ పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి వచ్చారు. 2019 తర్వాత లోకేష్ కూడా పాదయాత్ర చేపట్టి 2024లో అధికారంలోకి వచ్చేందుకు కృషిచేశారు. ఇటు తెలంగాణలో కూడా 2018 తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారు. అయితే తాజాగా ఈ పాదయాత్ర అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి పాదయాత్రతో రావాలని కేటీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అందుకు అంకురార్పణ జరిగే అవకాశం ఉంది. కేటీఆర్ పాదయాత్రతో 2028లో మరోసారి అధికారంలో తీసుకురావాలని భావిస్తున్నారు. వైఎస్, చంద్రబాబు, జగన్, లోకేష్‌కు కలిసొచ్చినట్లు కేటీఆర్‌కు పాదయాత్ర కలిసొస్తుందా అనేది సమయాన్ని బట్టి తెలుస్తుంది.