మీడియాతో కేటీఆర్‌ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ

మీడియాతో కేటీఆర్‌ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'ఫార్ములా ఈకేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం. అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది, ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు, 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదు. నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు. పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోంది. నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్ కు ఏమి దొరకటం లేదు. 600కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు. జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు. రేసు కావాలని నేను నిర్ణయం తీసుకున్న.. వద్దనేది రేవంత్ నిర్ణయం

ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్ లో చర్చ జరగలేదు. స్థానిక సంస్థల్లో బిసిలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే చూస్తూ ఉరుకొం. బిసిలకు మేము అండగా ఉంటాం. బీసీలను నమ్మించి మోసం చేస్తోంది ఈ ప్రభుత్వం.

నాపై కేసు పెడితే.‌. రేవంత్ పై కూడా కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? ఇతర దేశాల్లో కూడా ఫార్ములా ఈ రద్దు జరిగింది. ఫార్ములా ఈ వల్ల 600 కోట్లు నష్టం జరిగింది. ఏకపక్షంగా ఎలా రద్దు చేశారు. రద్దు చేయడం తప్పు .పైసలు ఎవరికి ముట్టాయో వారిపై కేస్ పెట్టలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పై నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఉద్యమ సమయంలో మేమే కొత్త సంప్రదాయం తెచ్చాము. ప్రతిపక్ష పార్టీ పాత్ర మేము చాలా స్పష్టంగా నిర్వహిస్తాం.మేము అన్యాయాన్ని ఎదిరిస్తున్నాం. 6 గ్యారెంటీ లు ఎక్కడ,420 హామీలు అమలు ఏవి. రైతు భరోసా ఇవ్వడం లేదు కానీ కేసీఆర్ ఎందుకు రాడు అంటున్నారు. కేసీఆర్‌ను అడిగి పీఏసీ చైర్మన్ ఇవ్వలేదు.ప్రతిపక్ష పార్టీ నాయకుడికి మీరు ఇచ్చే గౌరవం ఎక్కడ. రీజినల్ రింగ్ రోడ్డు లో అవినీతి జరుగుతుందని మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. 12000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ప్రజలపై మోపుతున్నారు. ప్రశాంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఒక్కరైనా సమాధానం చెప్పారా. ఎన్నికల ముందు మీ హామీలు ఏంది.సంవత్సరం కాలంలో ప్రభుత్వానికి మైనస్ మార్కులు మాత్రమే. పేద ప్రజలు మాత్రమే కనబడుతున్నారా, ముఖ్యమంత్రి అన్న కనిపించడం లేదా. కోర్టులతో తిట్లు పడ్డ ఏకైక ముఖ్యమంత్రి. చివరికి కోర్టుకు క్షమాపణ చెప్పాడు ఈ ముఖ్యమంత్రి. అప్పు చేయకపోవడమే అభివృద్ధి అన్నావు. ఇప్పుడు లక్షల కోట్ల అప్పు చేశావ్.ఎం చేశావు. లక్ష 35 వేల కోట్లలో ఢిల్లీ కాంగ్రెస్ కు ఎంత డబ్బు పోతుంది. ఆర్ ఆర్ ట్యాక్స్ రూపంలో ఢిల్లీ పెద్దలకు ముడుపులు పోతున్నాయి. ఖాజాగూడలో కూడా నిన్న పేద ప్రజల ఆస్తులపై కన్ను వేశారు. సంవత్సరం కాలంలో వీరు చేసింది ఏంటి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో కాంగ్రెస్ మంత్రులు,ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారా. ఎవరిని అడిగిన ఒక్కరైనా ఈ ముఖ్యమంత్రి ని మంచిగా మాట్లాడుతున్నారా అంటున్నారు. ఆరోపణలు తప్ప నిరూపించడం ఈ ప్రభుత్వానికి లేదు. రేవంత్ రెడ్డి పెద్ద కెడి ఇన్ ఇండియా అని అందరికి తెలుసు.

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న భారీ బహిరంగ. ఏడాది మెదటి హాఫ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తాం. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముంది. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం. రైతుబరోసాతో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది రైతుబరోసా కొందరికే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు? బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజిస్ట్రేషన్లు‌ ఇవ్వాలని రేవంత్‌కు లేదు. 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోంది ఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళకు రైతుబరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోంది' అని కేటీఆర్‌ అన్నారు.

ehatv

ehatv

Next Story