హైడ్రా బాధితులు(Hydra Victims) తండోపతండాలు తెలంగాణ భవన్‌కు(telangana bhavan) తరలి వస్తున్నారు.
హైడ్రా బాధితులు(Hydra Victims) తండోపతండాలు తెలంగాణ భవన్‌కు(telangana bhavan) తరలి వస్తున్నారు. తమ ఇళ్లను కూలగొడుతున్నారన్న ఆందోళనతో వేలాది మంది బాధితులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. బాధితులను హరీష్‌రావు(Harish rao), సబితాఇంద్రారెడ్డి(Sabitha indra reddy) కలిసి వారి గోడును వింటున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్(KTR) ట్వీట్ చేశారు. తాను 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా అని..మొన్న రాత్రి నుంచి జ్వరంతో, తీవ్ర దగ్గు జలుబుతో బాధపడుతున్నట్లు తెలిపిన కేటీఆర్. డాక్టర్ల సూచన మేరకు యాంటీ వైరల్, యాంటి బయోటిక్స్ మందులు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌కు వస్తున్న హైడ్రా బాధితులకు అండగా నిలబడాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. హైడ్రా బాధితులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని తెలిపిన కేటీఆర్