దీపావళి కంటే ముందే రాష్ట్రంలో బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి.

దీపావళి కంటే ముందే రాష్ట్రంలో బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. గత ప్రభుత్వంలో ఒకటి నుంచి 8 వరకు ఉన్న నేతలు అరెస్ట్‌ కాబోతున్నారని పొంగులేటి అన్నారు. కాళేశ్వరం(Kaleshwaram), ఫోన్‌ ట్యాపింగ్‌పై త్వరలోనే ఒకటో రెండో బాంబులు పేలుతున్నాయన్నారు. దీనికి బీఆర్‌ఎస్‌(BRS) నేతలు కూడా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. బాంబులంటే ఏం బాంబులు ఈడీ దాడుల బాంబులా, లేదా తుస్సు బాంబులా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి పొంగులేటి(Ponguleti Srinivas Reddy) డీజీపీనా అని కూడా ప్రశ్నించారు. అయితే గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొంత ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. రేవ్‌ పార్టీ నడుపుతున్నారని కేటీఆర్‌(KTR) బావమరిది ఇంట్లో పోలీసులు దాడులు చేశారు. అక్కడ డ్రగ్స్‌ ఉన్నాయన్న సమాచారంతో ఓ రాత్రంతా తనిఖీలు చేశారు. డ్రగ్స్ దొరకలేదని స్వయంగా ఎక్సైజ్‌ పోలీసులు ప్రకటించారు. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ స్పందించారు. కుటుంబమంతా కలిసి చేసుకుంటున్న పార్టీని రేవ్‌ పార్టీలాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కేటీఆర్‌ విమర్శించారు. అన్ని ప్రధాన మీడియాలో దీనిపైనే చర్చ జరిగింది. అయితే కేటీఆర్ తాజాగా మరో ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ ఇలా వేధించడంలో ఇప్పుడు, ఇప్పుడే తొలి అడుగు వేస్తోందని.. ఇలాంటి వేధింపులు ముందుముందు మరిన్ని జరగొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వేధింపులు ఎదురైనా ప్రజాసమస్యలను ఎండగట్టడంలో, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో వెనక్కి తగ్గేదిలేదని కేటీఆర్‌ అన్నారు. మరో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి(BRS MLA Jagadish Reddy)కూడా అరెస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కేసులు పెడతారు, మా అంటే అరెస్టులు చేస్తారు. అంత కంటే ఈ ప్రభుత్వం మనల్ని ఏం చేస్తుందని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు కేటీఆర్, జగదీష్‌రెడ్డి అరెస్టులపై మాట్లాడడంతో.. బాంబులు పేలుతాయన్న పొంగులేటి వ్యాఖ్యలకు బలం చేకూరుతున్నాయి.

ehatv

ehatv

Next Story