తన పై నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖను(Konda surekha) వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్(KTR) ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

తన పై నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖను(Konda surekha) వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్(KTR) ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. వ్యక్తిగత దాడులకు వ్యతిరేకంగా తాను గట్టి నిర్ణయం తీసుకున్నట్లు.. మంత్రి కొండా సురేఖ తన దురుద్దేశపూరితమైన, చౌకబారు వ్యాఖ్యలకు ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం(Defamation case) దావా వేశానన్నారు. చాలా కాలంగా సోషల్ మీడియా ద్వారా ఈ దాడులు & పాత్ర హత్యలకు పాల్పడే ప్రయత్నాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది, కానీ ఇకపై కాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధిగా తాను ఎల్లప్పుడూ వ్యక్తిగత వివాదాల కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. కానీ వ్యక్తిగత విమర్శలకు ఒక గీత గీయడానికి సమయం. రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు విమర్శలు ప్రచారం చేయవచ్చని భావించే వారికి ఈ పిటిషన్‌ ఒక గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్‌ అన్నారు. కోర్టులో నిజం గెలుస్తుందని నాకు నమ్మకం ఉందన్నారు.

Eha Tv

Eha Tv

Next Story