బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఆస్క్‌ కేటీఆర్‌(ASK KTR) కార్యక్రమాన్ని మరోసారి ఎంచుకున్నారు.

బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఆస్క్‌ కేటీఆర్‌(ASK KTR) కార్యక్రమాన్ని మరోసారి ఎంచుకున్నారు. సోషల్‌ మీడియా(social) వేదిక అయిన ఎక్స్‌లో గతంలో ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమం చేపట్టి పలువురు ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు. ప్రజలకు ఏదైనా సమస్య ఇంటే ఈ కార్యక్రమం ద్వారా పరిష్కారాలు చూపేవారు. అయితే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన తర్వాత ఆయన ఈ కార్యక్రమానికి గ్యాప్‌ ఇచ్చారు. తాజాగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆస్క్‌ కేటీఆర్‌ ప్రోగ్రాం చేపట్టారు. ట్విట్టర్లో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని అన్నారు. ట్విట్టర్‌లో #ASKKTR అని ప్రశ్నలు అడగాలని సూచించారు. కాగా కేటీఆర్ ఎలాంటి కామెంట్స్ చేస్తారనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

Eha Tv

Eha Tv

Next Story