ఫార్ములా ఈ రేస్‌పై(Formula E race) కేటీఆర్‌(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి(Revanth) గురువు చంద్రబాబు(Chandrababu) కూడా 2003 లో ఎఫ్1 రేసు హైదరాబాద్ లో నిర్వహించాలని ప్రయత్నం చేశారని.. రేవంత్ రెడ్డి గురువు చేయని పనిని మేము చేశాం. 2003లో ఎఫ్ 1 కోసం గోపన్ పల్లిలో 4 వందల ఎకరాల భూమి సేకరించి డెడికేటేడ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించి భూ సేకరణపై కేసులో కోర్టులో నడుస్తోంది. యూపీలో మాయావతి ప్రభుత్వం ఎఫ్ 1 రేసును నొయిడాలో జరిపారని కేటీఆర్‌ అన్నారు. ఎఫ్ 1 రేసు కోసం 2011 లోనే దాదాపు 17 వందల కోట్లు ఖర్చు చేశారని.. కామన్ వెల్త్ గేమ్స్ కోసం యూపీఏ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 70 వేల 600 కోట్లు చేశారన్నారు. క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వాలు ఖర్చు చేయటమనేది సర్వసాధారణమని.. ఎఫ్ 1 రేసు కోసం తాను కూడా ఎంతో ప్రయత్నం చేశానని కానీ ఇండియాకు(India) వచ్చే ఇంట్రెస్ట్ లేదని వాళ్లు చెప్పారన్నారు కేటీఆర్. ఈ-రేస్(E race) అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోందని.. ఈ నగరాలచోట హైదరాబాద్ ను చేర్చాలని మేము ఈ-రేస్ ను ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేశామన్నారు. సియోల్, జోహెన్నస్‌బర్గ్‌ను తలదన్ని మన హైదరాబాద్ కు ఈ-రేస్‌ను తీసుకొచ్చామన్నారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు మన హైదరాబాద్ ను ఎలక్ట్రిక్ మ్యానుఫాక్చరింగ్ చేద్దామనుకున్నామని.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు(Electric race) మన హైదరాబాద్ ను అడ్డాగా మార్చాలని మేము ఈ-రేస్‌ను ఒక అడుగుగా ప్రయత్నం చేశామన్నారు.

తాము ఈ-రేస్ కోసం ప్రభుత్వం తరఫున చేసిన ఖర్చు కేవలం రూ. 40 కోట్లు మాత్రమే. కానీ హైదరాబాద్ కు వచ్చిన ప్రయోజనం రూ. 700 కోట్లు అని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పిందని కేటీఆర్ అన్నారు. ఈ-రేస్‌ను ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు ఇచ్చాం. ఇందులో అర్వింద్ కుమార్ గారి తప్పు ఏం లేదని.. తాను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటాన్నారు కేటీఆర్. మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా రూ. 55 కోట్లు కట్టాలని.. తానే అర్వింద్ కుమార్ గారికి చెప్పానని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ ఈ-రేస్‌ను రద్దు చేయడంతో జాగ్వార్, నిస్సాన్ లాంటి సంస్థల వాళ్లు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించాయన్నారు. కేసు పెడితే పెట్టుకోండి.. రెండు నెలలు జైల్లో ఉండి మంచిగా యోగా చేసుకొని ట్రిమ్‌గా వస్తా. ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు.

Eha Tv

Eha Tv

Next Story