ఎన్నికల్లో(Election) రాజకీయ లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌(congress) కుట్రలకు పాల్పడిందని తనకు అనుమానాలున్నట్లు వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో(Election) రాజకీయ లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌(congress) కుట్రలకు పాల్పడిందని తనకు అనుమానాలున్నట్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో(Telangana bhavan) నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్‌(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన ప్రాంతంలో కాంగ్రెస్సే ఏదో కుట్రకు పాల్పడిందన్నారు. కేసీఆర్‌ను(KCR) బద్నాం చేసేందుకు కాంగ్రెస్‌ ఈ చర్యలకు పాల్పడినట్లు అనుమానాలున్నాయన్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉండగా మే-2023లో కొండపోచమ్మ సాగర్‌ నుంచి కాళేశ్వరం నీరు తెచ్చేందుకు రూ.1100 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చామని.. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని 5 వేల కోట్లకు పెంచి మల్లన్నసాగర్‌ నుంచి నీటిని తెస్తామని కొత్త కుంభకోణానికి తెరలేపారన్నారు. ఈ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ను గతంలో రేవంత్‌రెడ్డి(Revanth reddy) ఈస్ట్‌ఇండియా కంపెనీ అని విమర్శించిన మేఘా కంపెనీకే ఇస్తారన్నారు. కొడగంల్‌ ఎత్తిపోతల పథకాన్ని కేక్‌ను కోసి పంచుకున్నట్లు మేగా, రాఘవ కనస్ట్రక్షన్స్‌ కంపెనీ పంచుకుందన్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును కూడా మేగా కంపెనీకే ఇస్తారు చూడండన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas reddy) ఇంటిపై ఈడీ దాడులు జరిగి నెల గడుస్తున్నా ఎలాంటి సమాచారం బయటకు రాలేదన్నారు. అమృత్‌ స్కీం కింద రేవంత్‌రెడ్డి బావమరిది రూ.1100 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టారన్నారు. దీపావళిలోపు అరెస్టులు అని ఒక మంత్రి ఎలా చెప్తాడని.. ఆయన ఏమన్నా హోంమంత్రా లేదా డీజీపీనా చెప్పడానికి అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు చేసే చాలా కుంభకోణాలు భవిష్యత్‌లో బయటపెడతామన్నారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో 4 గంటలపాటు అదానీ కొడుకు డిన్నర్‌ మీటింగ్ నిర్వహించారని.. రాష్ట్రాన్ని అదానీ, ఈస్ట్‌ ఇండియా కంపెనీలకు తాకట్టుపెడుతున్నారన్నారు కేటీఆర్

Eha Tv

Eha Tv

Next Story