తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో ఏడాది పాలనపై పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఇందులో భాగంగా నేషనల్ ఫ్యామిలి ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్(National Family Opinion Private Limited) సంస్థ కూడా సర్వే నిర్వహించింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపింది. బీఆర్‌ఎస్(BRS)కు 43.13 శాతం ఓట్లు, కాంగ్రెస్(Congress)కు 24.99 శాతం, బీజేపీ(BJP)కి 22.88 శాతం, ఇతరులకు 9 శాతం వస్తాయని తెలిపింది. పార్టీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తే.. 10 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ సంస్థ సర్వే చెప్తోంది. బాన్సువాడలో బీఆర్‌ఎస్‌కు 39.78 శాతం, కాంగ్రెస్‌కు 21.04 శాతం, బీజేపీకి 30.88 శాతం ఓట్లు వస్తాయని నేషనల్ ప్యామిలీ ఒపీనియన్ సంస్థ వెల్లడించింది. జగిత్యాలలో అయితే బీఆర్‌ఎస్‌కు 39.15 శాతం, కాంగ్రెస్‌కు 18.46 శాతం, బీజేపీకి 32.44 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. మరో నియోజకవర్గం రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్‌కు 22.10 శాతం, బీఆర్‌ఎస్‌కు 41.97 శాతం, బీజేపీకి 28.05 శాతం ఓట్లు వస్తాయని.. శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌కు 45.45 శాతం, కాంగ్రెస్‌కు 23.74 శాతం, బీజేపీకి 20.98 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక చేవెళ్లలో బీఆర్‌ఎస్‌కు 46.23 శాతం, కాంగ్రెస్‌కు 23.24, బీజేపీకి 24.98 శాతం ఓట్లు వస్తాయన్నారు. ఇక పార్టీ ఫిరాయించిన నేతల్లో మొదటి వరుసలో ఉన్నదానం నాగేందర్‌కు ఇక్కడ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు 44.23 శాతం, బీజేపీకి 23.30 శాతం, కాంగ్రెస్‌కు 22.60 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. గద్వాల్‌లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. గద్వాల్‌లో బీఆర్‌ఎస్‌కు 44.65 శాతం, కాంగ్రెస్‌కు 22.62 శాతం, బీజేపీ 22.80 శాతం ఓట్లు వస్తాయని..భద్రాచలంలో బీఆర్‌ఎస్‌కు 41.74 శాతం, కాంగ్రెస్‌కు 29.52 శాతం, బీజేపీకి 15.99 శాతం ఓట్లు వస్తాయని నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సంస్థ తెలిపింది. పటాన్‌చెరులో బీఆర్‌ఎస్‌కు 41.29శాతం, కాంగ్రెస్‌కు 27.10 శాతం, బీజేపీకి 22.19 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక కూతురిని ఎంపీ చేసేందుకు పార్టీ మారిన మరో సీనియర్ నేత కడియం శ్రీహరికి కూడా ఉప ఎన్నిక వస్తే చిక్కులే వచ్చేలా ఉన్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు 45.61 శాతం, కాంగ్రెస్‌కు 28.91 శాతం, బీజేపీకి 17.67 శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ఓవరాల్‌గా అయితే బీఆర్‌ఎస్ ముందు వరుసలో ఉన్నా కానీ అనూహ్యంగా బీజేపీ పలు చోట్ల రెండో స్థానంలోకి రావడం విశేషం.