కాంగ్రెస్‌ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్త

కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్ చేస్తోంది. చార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్‌ఎస్ చేయాలని.. అన్ని నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఇవాళ ధర్నా కార్యక్రమాలు మొదలుపెట్టారు.

కాంగ్రెస్‌ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ధర్నాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల ముందు కూడా బీఆర్‌ఎస్‌ నిరసన చేపట్టింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated On 6 March 2024 12:46 AM GMT
Yagnik

Yagnik

Next Story