కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశాలు(Assembly sesions) రేపటి నుంచి జరగనున్నాయి.
కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశాలు(Assembly sesions) రేపటి నుంచి జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్నారు. మరో ప్రధాన అంశం రైతు భరోసా పథకంపై చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధివిధానాలపై నిర్ణయానికి వస్తామని ఇది వరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే, జాబ్ క్యాలెండర్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే రేపటి అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హాజరుకానున్నారు. ప్రతిపక్ష నేత(Opposition House Leader) హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ఎల్పీ(TRSLP) భేటీ కానుంది. ఈ భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకానుండడంతో సభలో చర్చలు ఎలా జరుగుతాయోనన్న ఉత్కంఠ అయితే నెలకొని ఉంది.