పార్లమెంట్ ఎన్నికల(Parliament Elelctions) కోసం భారత రాష్ట్ర సమితి(BRS) సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల(Parliament Constituencies) వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది.

పార్లమెంట్ ఎన్నికల(Parliament Elelctions) కోసం భారత రాష్ట్ర సమితి(BRS) సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల(Parliament Constituencies) వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్(KCR) ఆదేశాల మేరకు తెలంగాణ భవన్(Telangana Bhavan) వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి(Madhusudhanachari), మాజీ మంత్రులు హరీష్ రావు(Harish Rao), కడియం శ్రీహరి(Kadiyam Srihari), పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో... మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనుంది.

జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి స్థానాలపై చర్చిస్తారు. సంక్రాంతి తర్వాత 16న నల్గొండ, 17న నాగర్‌కర్నూలు, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజ్‌గిరి, 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ స్థానాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు

Updated On 29 Dec 2023 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story