1989 నుంచి ఈ సెంటిమెంట్‌ కొనసాగుతూ వస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌(TRS) తరపున సినీనటుడు బాబూమోహన్‌(Babu mohan) విజయం సాధించారు. కిందటిసారి 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌(Chanti Kranthi Kiran) గెలుపొందారు.

తెలంగాణ(Telangana) ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలివి! గత రెండు సార్లు జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు కొంచెం భిన్నంగా ముక్కోణపు పోరు జరుగుతోంది. మూడు ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్‌(BRS), కాంగ్రెస్‌(Congress), బీజేపీలు(BJP) విజయమే లక్ష్యంగా సమరాంగణానికి సంసిద్ధమవుతున్నాయి. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు వేటికవే ప్రత్యేకమైనప్పటికీ కొన్నింటిపై మాత్రం ప్రజల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సంగారెడ్డి(sangareddy) జిల్లాలోని ఆందోల్‌ నియోజకవర్గమే(Andol Constituency) తీసుకుంటే, దీనికో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఇక్కడి నుంచి ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆ పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది.

1989 నుంచి ఈ సెంటిమెంట్‌ కొనసాగుతూ వస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌(TRS) తరపున సినీనటుడు బాబూమోహన్‌(Babu mohan) విజయం సాధించారు. కిందటిసారి 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌(Chanti Kranthi Kiran) గెలుపొందారు. ఈ రెండుసార్లు బీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) అభ్యర్థి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha) విజయం సాధించారు. ఈ రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.

దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా లభించింది. 1999లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ(TDP) అభ్యర్థిగా బరిలో దిగిన బాబూమోహన్‌ విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు అంటే 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాల్యాల రాజయ్య గెలుపొందారు. అప్పుడు కూడా టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అల్‌దేకర్‌ లక్ష్మణ్‌ విజయం సాధించారు. అప్పుడు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.

కొన్ని దశాబ్దాలుగా ఈ సెంటిమెంట్‌ కొనసాగుతూ వస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఈ సెంటిమెంట్‌ పని చేస్తుందా? ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీనే అధికారంలోకి వస్తుందా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఆందోల్‌ అసెంబ్లీ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అప్పుడది జనరల్‌ స్థానమే!
1962లో జరిగిన ఎన్నికల్లోనూ అది జనరల్‌ స్ఠానమే!1967లో అది ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది సార్లు విజయం సాధిస్తే, తెలుగుదేశంపార్టీ నాలుగుసార్లు గెలుపొందింది.

ఒకసారి ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందాడు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీనే విజయం సాధించింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర రాజనర్సింహకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గాలలో సభ్యుడిగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ఆయన తండ్రి రాజనర్సింహ కూడా కాసు బ్రహ్మానందరెడ్డి, అంజయ్య మంత్రివర్గాలలో పని చేశారు. తండ్రి కొడుకులిద్దరూ మంత్రులవ్వడం విశేషమే! రాజనర్సింహ ఆందోల్ నుంచి మూడుసార్లు, సదాశివపేట నుంచి ఒకసారి విజయం సాధించారు. తెలుగుదేశంపార్టీ నుంచి గెలిచిన రాజయ్య కూడా మంత్రిగా ఉన్నారు. ఆయన ఎన్టీఆర్‌, చంద్రబాబు క్యాబినెట్‌లలో పని చేశారు. బాబూ మోహన్‌ కూడా చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Updated On 14 Oct 2023 8:15 AM GMT
Ehatv

Ehatv

Next Story