అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) పరాజయం తర్వాత బీఆర్‌ఎస్(BRS) మేథోమధనం చేస్తోంది. ఓటమికి కారణాలను వెతుక్కుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లను సమీక్షించుకుంటోంది. అప్పుడు విస్మరించిన వారిని ఇప్పుడు దగ్గరకు తీసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికలనాటికి(Lok Sabha Elections) తప్పులన్నింటినీ దిద్దుకోవాలనే నిర్ణయం తీసుకుంది. అమరవీరుడు శ్రీకాంతాచారి(Srikantha Chary) తల్లి శంకరమ్మను(Shankarmma) అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకోలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) పరాజయం తర్వాత బీఆర్‌ఎస్(BRS) మేథోమధనం చేస్తోంది. ఓటమికి కారణాలను వెతుక్కుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లను సమీక్షించుకుంటోంది. అప్పుడు విస్మరించిన వారిని ఇప్పుడు దగ్గరకు తీసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికలనాటికి(Lok Sabha Elections) తప్పులన్నింటినీ దిద్దుకోవాలనే నిర్ణయం తీసుకుంది. అమరవీరుడు శ్రీకాంతాచారి(Srikantha Chary) తల్లి శంకరమ్మను(Shankarmma) అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకోలేదు. 2014లో టికెట్ ఇచ్చిందంతే! ఆ తర్వాత ఆమెను ప్రగతిభవన్(Pragathi bhavan) దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. మొన్నామధ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(CM Revanth Reddy) శంకరమ్మ కలుసుకున్నారు. ఆమెకు ప్రభుత్వం కీలక పదవికి ఇవ్వబోతున్నదనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ(MLC) పోస్టులతో పాటు నామినేటేడ్ పోస్టులను భర్తికి కసరత్తులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శంకరమ్మకు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాలని రేవంత్‌రెడ్డి భావించారని ప్రచారం జరిగింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను అసలు పట్టించుకోలేదని, ముఖ్యంగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఒకవేళ శంకరమ్మ కాంగ్రెస్‌పార్టీలో చేరితే మాత్రం ఆ ప్రభావం పార్టీపై తీవ్రంగా పడుతుందని బీఆర్‌ఎస్ ఆందోళన చెందింది. ఆమెతో పాటు చాలా మంది ఉద్యమకారులు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారనే వార్త బీఆర్‌ఎస్ అధినాయకత్వానికి కంగారు పుట్టిస్తోంది. దీంతో బీఆర్‌ఎస్‌కు అప్రమత్తమయ్యింది. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదనే చెడ్డపేరు వస్తుందని కంగారుపడింది. వెంటనే శంకరమ్మతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ మారే విషయంలో తొందరపడవద్దని ఆమెకు సూచించారు. ఆమెను సముదాయించారు. కేటీఆర్, హరీశ్‌ల సముదాయింపుల తర్వాత శంకరమ్మ మనసు మార్చుకున్నారో లేదో తెలియదు.