ఆర్‌టీవీ(RTV) రవిప్రకాష్‌పై(RaviPrakash) చర్యలకు బీఆర్‌ఎస్(BRS) పార్ట సిద్ధమైంది.
ఆర్‌టీవీ(RTV) రవిప్రకాష్‌పై(RaviPrakash) చర్యలకు బీఆర్‌ఎస్(BRS) పార్ట సిద్ధమైంది. త్వరలోనే బీజేపీలో(BJP) బీఆర్‌ఎస్ విలీనమవుతుందన్న వార్తలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టిగానే స్పందించారు. పదే పదే బీజేపీకి తల వంచే ప్రసక్తే లేదని ఎన్నో వేదికల్లో చెప్తున్నా పదే పదే అదేప ప్రసారం చేయడంపై ఆ పార్టీ సీరియస్ అయింది. బీఆర్‌ఎస్ పార్టీ మరో 50 ఏళ్ల పాటు ప్రజల ఆదరాభిమానాలతో బలంగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. బీజేపీలో విలీనం అవుతుందని వాడొకడు, వీడొకడు అంటున్నారని, ఢిల్లీకి వెళ్లి తాను లాయర్లతో మాట్లాడితే బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తాము బీజేపీతో ఒప్పందం పెట్టుకుని ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజుల నుంచి జైలులో ఉండేదా అని ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైలులో ఉన్నారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ అదృశ్యమైపోవాలని కోరుకునే వాళ్లు చాలామందే ఉన్నారని, 24 ఏళ్ల పాటు విజయవంతంగా కొనసాగుతూ వచ్చిన ఈ పార్టీ మరో 50 ఏళ్ల పాటు బలంగా కొనసాగుతుందని కేటీఆర్ చెప్పారు. అయితే తాజాగా రవిప్రకాష్ తాను గతంలో చెప్పిన విషయానికి కట్టుబడి ఉన్నట్లు మరోసారి బీఆర్‌ఎస్‌పై ప్రచారం చేశారు. దీనిపై సీరియసైన బీఆర్‌ఎస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పార్టీపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారని నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బీజేపీలో BRS పార్టీ విలీనం అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆ చానెల్ అధినేత RTV రవిప్రకాష్‌కు నోటీసులు ఇవ్వనుంది.