BRS Party Not Given MLA Ticket For Communist Parties : కమ్యూనిస్టులకు అవమానం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) కమ్యూనిస్టులకు(Communist) బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్ రెండు మూడు సీట్లు కేటాయించే అవకాశం ఉందని చాన్నాళ్లుగా ఓ ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఇవాళ కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 115 అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. కేవలం నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అంటే కమ్యూనిస్టులకు మొండిచేయి చూపించారని అనుకోవచ్చు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపు కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీ శ్రమించాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం వెనుక కమ్యూనిస్టులు ఉన్నారనే చర్చ కూడా జరిగింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) కమ్యూనిస్టులకు(Communist) బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్ రెండు మూడు సీట్లు కేటాయించే అవకాశం ఉందని చాన్నాళ్లుగా ఓ ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఇవాళ కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 115 అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. కేవలం నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అంటే కమ్యూనిస్టులకు మొండిచేయి చూపించారని అనుకోవచ్చు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపు కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీ శ్రమించాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం వెనుక కమ్యూనిస్టులు ఉన్నారనే చర్చ కూడా జరిగింది. గతంలో మునుగోడు సీటు కమ్యూనిస్టులదే! అక్కడ వామపక్షాలకు మంచి బలం ఉంది. దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ(Nalgonda), ఖమ్మం(Khammam) జిల్లాలో కమ్యూనిస్టులకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ రెండు జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో కమ్యూనిస్టులతో పొత్తు బీఆర్‌ఎస్‌కు ఉపయోగపడగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పెండింగ్‌లో పెట్టిన నాలుగు నియోజకవర్గాలలో కమ్యూనిస్టులు గతంలో పోటీ చేసిన స్థానం నర్సపూర్ ఒక్కటే! జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలలో వామపక్షాలు ఎప్పుడూ పోటీ చేయలేదు. మొత్తంమీద కమ్యూనిస్టులకు టికెట్లు ఇచ్చేది లేదని పరోక్షంగా కేసీఆర్ చెప్పినట్టే! ఓ రకంగా కమ్యూనిస్టులను అవమానించినట్టే అయ్యింది.