పాపం... కొత్తగూడెం(kothagudem) టికెట్‌ తనకే వస్తుందని, కేసీఆర్‌(KCR) తనను కరుణిస్తారని ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌(Health director) గడల శ్రీనివాసరావుకు(Gadala Srinivasa Rao) నిరాశే మిగిలింది. చాన్నాళ్లుగా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు శ్రీనివాసరావు. కేసీఆర్‌కు వంగి వంగి దండాలు కూడా పెట్టారు.

పాపం... కొత్తగూడెం(kothagudem) టికెట్‌ తనకే వస్తుందని, కేసీఆర్‌(KCR) తనను కరుణిస్తారని ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌(Health director) గడల శ్రీనివాసరావుకు(Gadala Srinivasa Rao) నిరాశే మిగిలింది. చాన్నాళ్లుగా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు శ్రీనివాసరావు. కేసీఆర్‌కు వంగి వంగి దండాలు కూడా పెట్టారు. పూజలు పునస్కారాలు చేశారు. ఇంత చేసినా కేసీఆర్‌ దయ కలగలేదు. బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థులను ప్రకటించడానికి ఓ రోజు ముందు, అంటే ఆదివారం కూడా కొత్తగూడెంలో శ్రీనివాసరావు హడావుడి చేశారు. కొత్త కొత్తగూడెం అనే నినాదాన్ని ఎత్తుకుని మున్సిపాలిటీలో పాదయాత్ర కూడా చేశారు.

23వ వార్డులోని అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. తర్వాత జీఎస్‌ఆర్‌ ట్రస్ట్(GSR Trust) సభ్యులతో కలిసి ఇంటింటికి పాదయాత్ర చేశారు. ఇళ్లిళ్లు తిరుగుతూ ఆడపడచులకు పసుపుకుంకుమలు, గాజులు ఇచ్చారు. కరపత్రాలను పంపిణీ చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయం అంటే సేవ అని, కొత్తగూడెం ప్రజలకు సేవ చేయడమే తన ఆశయమని ఉపన్యాసం కూడా ఇచ్చారు. ఇంతా చేసి బీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకుండా పోయింది. కొత్తగూడెం టికెట్‌ మళ్లీ వనమా వెంకటేశ్వరరావునే వరించింది. నిరాశ నిస్పృహలకు లోనైన శ్రీనివాసరావు ఇప్పుడేం చేస్తారు?

ఎందుకొచ్చిన రాజకీయాలని అనుకుంటూ హెల్త్‌ డైరెక్టర్‌గా ఉద్యోగం చేసుకుంటారా? లేక రాజకీయాల అంతు చూసేందుకు మరో పార్టీలో కర్చిఫ్‌ వేసి చూస్తారా? అన్నది సస్పెన్స్‌గానే ఉంది. వేరే పార్టీలోకి వెళ్లి టికెట్‌ తెచ్చుకుని, ఎన్నికల్లో నిలబడితే మాత్రం హెల్త్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేయాల్సి వుంటుంది. ఇది మరీ ప్రమాదకరం! అందుకే ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉంటూ కేసీఆర్‌ కరుణ కోసం ఎదురుచూడటమే ఉత్తమమని ఆయన అనుకుంటున్నారట!

ఎవరెన్ని రకాలుగా అనుకుంటున్నా శ్రీనివాసరావు తన ప్రయత్నాలను ఎప్పుడూ ఆపలేదు. కొన్ని నెలలుగా జీఎస్‌ఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేస్తూ వెళుతున్నారు. అయితే ఉద్యోగరీత్యా రోజూ కుదరని పని కాబట్టి వారాంతంలో వచ్చి ఈ పనులన్నీచేస్తున్నారు. హెల్త్‌ డైరెక్టర్‌గా ఉద్యోగం చేస్తూ రాజకీయాలు చేయడమేమిటని విపక్షాలు విమర్శిస్తున్నా శ్రీనివాసరావు పట్టించుకోలేదు. టికెట్ కోసం శ్రీనివాసరావు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా భంగపాటు తప్పలేదు. మరి హెల్త్‌ డైరెక్టర్‌ ఇప్పుడేం చేస్తారో చూడాలి!

Updated On 23 Aug 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story