2023 అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్ధులను పార్టీ అధినేత కేసీఆర్(KCR) సోమవారం ప్రకటించారు. పెద్దగా మార్పులు చేయలేదన్న కేసీఆర్.. 7 స్థానల్లో ఆ మార్పులుంటాయని ప్రకటించారు. పౌరసత్వం సమస్యతో కొట్లాడుతున్న ఎమ్మెల్యే చెన్నమనేని ఆనంద్ బరిలో ఉన్న వేములవాడ స్థానం, కోరుట్ల స్థానం, వైరా స్థానం, అసిఫాబాద్, బొద్, ఉప్పల్ స్థానాల్లో మార్పు మార్పులు చేసినట్లు తెలిపారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్ధులను పార్టీ అధినేత కేసీఆర్(KCR) సోమవారం ప్రకటించారు. పెద్దగా మార్పులు చేయలేదన్న కేసీఆర్.. 7 స్థానల్లో ఆ మార్పులుంటాయని ప్రకటించారు. పౌరసత్వం సమస్యతో కొట్లాడుతున్న ఎమ్మెల్యే చెన్నమనేని ఆనంద్ బరిలో ఉన్న వేములవాడ స్థానం, కోరుట్ల స్థానం, వైరా స్థానం, అసిఫాబాద్, బొద్, ఉప్పల్ స్థానాల్లో మార్పు మార్పులు చేసినట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావుపై వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా అభ్యర్ధుల జాబితాలో ఉంది.
నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోశామహల్ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. రెండు, మూడు రోజుల్లో ఆ స్థానాల్లోనూ అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ సారి గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దుబ్బాక నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి, వేములవాడ నుంచి చల్మెడ ఆనందరావు, హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డిలు బరిలో ఉంటారని కేసీఆర్ ప్రకటించారు