దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని.. దేశ రాజకీయాల్లో నూతన ఆవిష్కరణలు జరగాలని 2018 ఎన్నికల తర్వాత పదేపదే చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని.. ఎన్డీఏ(NDA), ఇండియా కూటమికి(INDIA alliance) ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటుకు ప్రయత్నించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినా కూటమి ఏర్పాటుకు సఫలం కాలేకపోయారు.
దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని.. దేశ రాజకీయాల్లో నూతన ఆవిష్కరణలు జరగాలని 2018 ఎన్నికల తర్వాత పదేపదే చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని.. ఎన్డీఏ(NDA), ఇండియా కూటమికి(INDIA alliance) ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటుకు ప్రయత్నించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినా కూటమి ఏర్పాటుకు సఫలం కాలేకపోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఎంట్రీ కావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరుతో సాధ్యం కాదనునుకున్న కేసీఆర్(KCR).. తన పార్టీని భారత రాష్ట్ర సమితిగా(BRS) మార్చారు. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఏపీలో బీఆర్‌ఎస్‌ను విస్తిరించాలని కేసీఆర్ భావించారు. ఇందుకు సంబంధించి పలు చోట్ల బీఆర్‌ఎస్ కార్యాలయాలను కూడా ప్రారంభించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో(TS Assembly Elections) కచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ అనుకుంది. రాష్ట్రంలో గెలిచి ఇదే ఊపుతో పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకుంది. అయితే తెలంగాణలో పార్టీ ఓటమి పాలు కావడంతో బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గా(TRS) మార్చాలని అధిష్టానంపై పలువురు నేతలు, కార్యకర్తలుఒత్తిడి చేస్తున్నారు. పార్లమెంటరీ(Parliament) సన్నాహక సమావేశాల్లో కొందరు నేతలు, కార్యకర్తలు కుండబద్ధలు కొట్టినట్లు తమ అభిప్రాయాలను వెల్లిబుచ్చుతున్నారు. బీఆర్‌ఎస్‌గా మారడంతో తెలంగాణ అన్న పదానికే పార్టీ దూరమైందని.. తెలంగాణ సెంటిమెంట్‌కు పార్టీ దూరమైందని చెప్తున్నారు. ఈ సెంటిమెంట్ వల్ల కూడా ఓటర్లు కొంత మేర బీఆర్‌ఎస్‌కు ఓటు వేయలేదని చెప్తున్నారు. ప్రజలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. కేటీఆర్, హరీష్‌రావు, కేశవరావు, పోచారం, కడియం ముందు నేతలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను మార్చి మళ్లీ టీఆర్‌ఎస్‌గా చేయాలన్న ప్రతిపాదనను ముందుంచారు. టీఆర్‌ఎస్ ఉంటేనే విజయవంతమవుతామని పలువురు అభిప్రాయడుతున్నారు. అయితే కేటీఆర్ మాత్రం పార్టీ పేరు మారిపోయిందని.. ఇప్పుడు ఈ చర్చ అవసరం లేదన్నట్లుగా తెలుస్తోంది. అయితే కడియం శ్రీహరి మాత్రం పార్టీ మార్పుపై కార్యకర్తలు, లీడర్లు పలురకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారన్నారు. వారి అభిప్రాయాలను అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మళ్లీ టీఆర్ఎస్‌గా మార్పు చేసే అవకాశంపై కేసీఆర్ ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.