☰
✕
ఓ బీఆర్‌ఎస్(BRS) కౌన్సిలర్ ప్రజాసేవ చేయమంటే వివాహేతర సంబంధం(Extra Marital affair) పెట్టుకొని శృంగార సేవలో తరించిపోతున్నాడు.
x
ఓ బీఆర్‌ఎస్(BRS) కౌన్సిలర్ ప్రజాసేవ చేయమంటే వివాహేతర సంబంధం(Extra Marital affair) పెట్టుకొని శృంగార సేవలో తరించిపోతున్నాడు. కూతురు వరుసుయ్యే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని లాడ్జ్‌లో రాసలీలల కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కౌన్సిలర్‌కు తమదైన స్టైల్లో 'కౌన్సిలింగ్' చేశారు. బోధన్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బెంజర్ గంగారాం(Benjar Gangaram) కూతురు వయసున్న ఒక అమ్మాయితో బోధన్ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో దొరికిపోయాడు. యువతి తల్లిదండ్రులు, బంధువులు కౌన్సిలర్‌కు దేహ శుద్ధి చేశారు. లాడ్జి నుంచే కొట్టుకుంటూ, కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్ వరకు తీసుకెళ్లారు. కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Eha Tv
Next Story