సీతక్కలాగే నాగజ్యోతికి కూడా కోయ సామాజికవర్గం కావడం విశేషం. సీఎం కేసీఆర్ విడుదల చేసిన మొదటి లిస్టులో నాగజ్యోతే అతి చిన్న వయస్కురాలు కావడం మరో చెప్పుకోదగ్గ అంశం. నాగజ్యోతి వయసు 29 ఏళ్లే! గత జడ్పీటీసీ ఎన్నికల్లో తాడ్వాయి నుంచి విజయం సాధించిన నాగజ్యోతి ములుగు జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్ కన్నుమూయడంతో నాగజ్యోతి ఇన్‌చార్జ్ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ములుగు టికెట్‌ను బీఆర్‌ఎస్ నాగజ్యోతికి కేటాయించడంతో రాబోయే ఎన్నిక ఆసక్తికరంగా మారింది. సీతక్కకు గట్టిపోటీని ఇచ్చేది జ్యోతక్కనేనని బీఆర్‌ఎస్ శ్రేణులు అంటున్నాయి.
తెలంగాణకు(Telangana) ఇది ఎన్నికల(Elections) రుతువు. అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) సమయం దగ్గరపడుతోంది. బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అభ్యర్థుల ఎంపికపై కసర్తులు చేస్తున్న విపక్షాలకు షాకిచ్చారు కేసీఆర్(KCR). ఆల్‌మోస్టాల్ సిట్టింగ్‌లందరికీ టికెట్లు దొరికాయి. సోమవారం 115 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఇందులో అందరిని ఆకర్షిస్తున్న పేరు బడే నాగజ్యోతి(Bade Nagajyothi). వచ్చే ఎన్నికల్లో ములుగు(Mulugu) నియోజకవర్గం నుంచి ఈమె బరిలో దిగబోతున్నారు. కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే సీతక్కకు(Sitha) పోటీగా నిల్చోబోతున్నారు. ప్రస్తుతం నాగజ్యోతి ములుగు జడ్పీ ఇన్‌ఛార్జ్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.
సీతక్కలాగే నాగజ్యోతికి కూడా కోయ సామాజికవర్గం కావడం విశేషం. సీఎం కేసీఆర్ విడుదల చేసిన మొదటి లిస్టులో నాగజ్యోతే అతి చిన్న వయస్కురాలు కావడం మరో చెప్పుకోదగ్గ అంశం. నాగజ్యోతి వయసు 29 ఏళ్లే! గత జడ్పీటీసీ ఎన్నికల్లో తాడ్వాయి నుంచి విజయం సాధించిన నాగజ్యోతి ములుగు జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్ కన్నుమూయడంతో నాగజ్యోతి ఇన్‌చార్జ్ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ములుగు టికెట్‌ను బీఆర్‌ఎస్ నాగజ్యోతికి కేటాయించడంతో రాబోయే ఎన్నిక ఆసక్తికరంగా మారింది. సీతక్కకు గట్టిపోటీని ఇచ్చేది జ్యోతక్కనేనని బీఆర్‌ఎస్ శ్రేణులు అంటున్నాయి.
మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన సీతక్క తర్వాత పోలీసులకు లొంగిపోయారు. అటు పిమ్మట రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో ములుగు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసి అదే వీరయ్యను ఓడించారు సీతక్క. ఆ విధంగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీతక్క టీఆర్‌ఎస్‌కు చెందిన చందూలాల్‌పై విజయం సాధించారు. నాగజ్యోతిది కూడా మావోయిస్టు నేపథ్యం ఉన్న కుటుంబమే! మావోయిస్టు బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్- రాజేశ్వరి అలియాస్ నిర్మలక్కల ఏకైక సంతానమే నాగజ్యోతి. నాగేశ్వరరావు ఏటూరు నాగారం దళ కమాండర్‌గా పని చేశారు. 1999లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశారు. అప్పటికి దళ సభ్యురాలిగా ఉన్న రాజేశ్వరి పోలీసులకు లొంగిపోయారు. అయిదేళ్ల కిందట ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కలవపల్లి గ్రామానికి చెందిన నాగజ్యోతి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో బోటనీలో ఎమ్మెస్సీ చేశారు.
తర్వాత బీఈడీ చేశారు. 2019లో మొదటిసారిగా సర్పంచ్‌గా పోటీ చేసి విజయంసాధించారు. తర్వాతబీఆర్‌ఎస్‌లో చేరారు. నాగజ్యోతి మామ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్ కమాండర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ములుగు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బడే నాగజ్యోతి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. ములుగులో విజయం సాధించి ఆ గెలుపును కేసీఆర్‌కు కానుకగా ఇస్తానని అన్నారు నాగజ్యోతి. తనకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ములుగులో సీతక్క-జ్యోతక్క పోరు అత్యంత ఆసక్తికరంగా మారడం ఖాయం!