లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఇవాళ ఎమ్మెల్సీ కవిత హాజరుకావాల్సింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచే ఢిల్లీలో ఓ రకమైన ఉత్కంఠ నెలకొంది. మొన్న అంటే 11న కవిత విచారణకు హాజరైనప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదు. ఈ రోజు మాత్రం పొద్దున్నుంచే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10 గంటలకు కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని వార్తలు వచ్చాయి. కాసేపటి తర్వాత పది గంటలకు కాదు, పదిన్నరకు అనే న్యూస్ వచ్చింది
లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఇవాళ ఎమ్మెల్సీ కవిత హాజరుకావాల్సింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచే ఢిల్లీలో ఓ రకమైన ఉత్కంఠ నెలకొంది. మొన్న అంటే 11న కవిత విచారణకు హాజరైనప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదు. ఈ రోజు మాత్రం పొద్దున్నుంచే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10 గంటలకు కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని వార్తలు వచ్చాయి. కాసేపటి తర్వాత పది గంటలకు కాదు, పదిన్నరకు అనే న్యూస్ వచ్చింది. కానీ ఆమె ఇప్పటి వరకు కేసీఆర్ నివాసం నుంచి బయటకు రాలేదు. 11 గంటలకు ఆమె ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉన్నా ఆమె మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈడీ విచారణకు హాజరుకాలేనంటూ ఈడీ కోరిన సమాచారాన్ని ఆమె న్యాయవాది సోమభరత్ ద్వారా పంపారు. మహిళను ఈడీ ఆఫీసుకు పిలవొచ్చా అనేదానిపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. అయితే స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించినప్పటికీ 24న విచారిస్తామని తెలిపింది. అప్పటి వరకు విచారణకు రాలేనని కవిత ఈడీకి విన్నవించుకున్నారు. తన ఇంటిదగ్గరే ఈడీ అధికారులు విచారించాలని కోరారు.
నిజానికి బుచ్చిబాబు, పిళ్లై, సిసోడియాతో కలిసి కవితను విచారించాలని ఈడీ భావించింది. అయితే రేపటితో సిసోడియా కస్టడీ ముగుస్తుంది. అలాగే పిళ్లై కస్టడీ కూడా ఇవాళ్టితో ముగుస్తుంది. కవిత గైర్హాజరు అయ్యారు కాబట్టి కన్‌ఫ్రంటేషన్‌లో విచారణకు అవకాశాలు లేకుండాపోయాయి. ఇప్పుడు ఈడీ తర్వాత స్టెప్ ఏమిటన్నదానిపై ఆసక్తి పెరిగింది.