అదానీ(Adani) వ్యవహారంపై బీఆర్‌ఎస్‌(BRS) నేత, ఎంఎల్సీ కవిత(MLC Kavitha) సంచలన ట్వీట్(Tweet) చేశారు.

అదానీ(Adani) వ్యవహారంపై బీఆర్‌ఎస్‌(BRS) నేత, ఎంఎల్సీ కవిత(MLC Kavitha) సంచలన ట్వీట్(Tweet) చేశారు. బీజేపీ(BJP), ప్రధాని మోడీపై(Modi) ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.

జైలు నుంచి విడుదల తర్వాత రాజకీయపరంగా తొలిసారి ట్వీట్‌ను కవిత ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని కవిత ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ అని.. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని ప్రధానిని కవిత ప్రశ్నించారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని సూటిగా ప్రశ్నించారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి బెయిల్‌పై కవిత ఉన్నారు. దాదాపు ఆరు నెలల పాటు కవిత జైలులో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న సమయంలోనే గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుసార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యాక్టివ్‌ రాజకీయాల్లో కవిత పాల్గొనడం లేదు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా అదానీపై ట్వీట్‌ వేయడంతో ఆమె ఇకపై రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story