భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) రాష్ట్రం సాధించుకోవడం ఎంత ముఖ్యమో.. అంతే ముఖ్యంగా మన సంస్కృతి(Culture), సంప్రదాయాలు(Traditions) కాపాడుకోవాలని జాగృతి ఉద్యమం చేసిందని కవిత తెలిపారు.

BRS MLC Kavitha
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) రాష్ట్రం సాధించుకోవడం ఎంత ముఖ్యమో.. అంతే ముఖ్యంగా మన సంస్కృతి(Culture), సంప్రదాయాలు(Traditions) కాపాడుకోవాలని జాగృతి ఉద్యమం చేసిందని కవిత తెలిపారు. ఎవరి భాష వాళ్లకు ఉంటుందని.. కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత సూచించారు. సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాదిస్తామని, కానీ ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా రూల్స్ బ్రేక్ చేస్తామన్నారు. తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందని అన్నారు.
తెలంగాణ జాగృతి దేశంలో ఉన్న ప్రజలను జాగృతం చేసేందుకు భారత జాగృతిగా రూపుదిద్దుకుందన్నారు. 530కు పైగా కళాకారులకు జీతం ఇస్తూ వారిని గౌరవిస్తూన్నామని తెలిపారు. కళాకారులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సాహిత్య సభలు జరపాలని ఈ కార్యక్రమం రూపొందించామన్నారు. రెండు రోజుల పాటు ఈ సాహిత్య సభలు జరుగుతాయని.. అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఈ సభలకు అతిధులుగా డా.నందిని సిద్దారెడ్డి(Dr. Nandhini Reddy), డా. గోరేటి వెంకన్న(Dr. Goreti Venkanna), డా. తిరునగరి దేవకిదేవి(Dr. Thirunagari Devakidevi), డా. గోగు శ్యామల(Dr.Gogu Shyamla), తిగుళ్ల కృష్ణమూర్తి(Tigulla Krishnamurthy), డా. ఏనుగు నరసింహ రెడ్డిలతో పాటు పలువురు కవులు పాల్గొన్నారు.
