సింగరేణి(Singareni) గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS)ను గెలిపించాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తెలిపారు. కేసీఆర్(KCR) హయాంలో సంస్థ కోసం, కార్మికుల(workers) సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటు వేయాలన్నారు.

సింగరేణి(Singareni) గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS)ను గెలిపించాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తెలిపారు. కేసీఆర్(KCR) హయాంలో సంస్థ కోసం, కార్మికుల(workers) సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. సింగరేణి సంస్థ ఎదుగుదలకు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్(BRS) పార్టీ హయాంలో దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు యువతకు కల్పించామని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని ప్రస్తావించారు. కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిననాటికి లాభాల్లో కార్మికులకు వాటా కేవలం18 శాతంగా ఉండేదని, దాన్ని గత ప్రభుత్వం 32 శాతానికి పెంచిందన్నారు. కార్మికుల కోసం గతంలో ఎప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Updated On 22 Dec 2023 8:11 AM GMT
Ehatv

Ehatv

Next Story