✕
165 రోజుల విరామం తరువాత ఎక్స్‌లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పోస్ట్ చేశారు.

x
165 రోజుల విరామం తరువాత ఎక్స్‌లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పోస్ట్ చేశారు. 'సత్యమేవ జయతే' అంటూ తన భర్త అనిల్(anil), సోదరుడు కేటీఆర్‌లతో(KTR) కలిసి ఉన్న ఫొటోను కవిత పోస్ట్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో 165 రోజులపాటు కవిత తీహార్ జైలులో గడిపారు. ఈనెల 27న బెయిల్ రావడంతో ఆమె నిన్న హైదరాబాద్‌లోని సొంత ఇంటికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో కవిత అభిమానులు, బీఆర్‌ఎస్ శ్రేణులు ఆమెకు స్వాగతం తెలిపారు. సొంత ఇంటికి చేరుకున్న తర్వాత సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. తల్లి శోభమ్మను ఆలింగనం చేసుకున్నారు. అయితే ఈరోజు కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
సత్యమేవ జయతే pic.twitter.com/Q0HzR0aouy
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2024

Eha Tv
Next Story