ఇలాంటి తరుణంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి బాష అభ్యంతరకరంగా ఉందని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం వేరు.. సీఎం హోదాలో మాట్లాడటం వేరన్నారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరైంది కాదని.. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి అని ఆరోపించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ వేదికగా కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న తనపై అసభ్య పదజాలంతో దూషించటమేంటని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ లోని వాస్తవాలను చూపించేందుకు ఎమ్మెల్యేలను తీసుకెళ్తే, కేసీఆర్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఏ విధంగా మేలు చేయాలనే దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ వీధి నాటకాలు చేస్తున్నారని.. మేడిగడ్డతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులపై సభలో చర్చిద్దామని… దమ్ముంటే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ను తీసుకురావాలని సవాల్ విసిరారు. పూర్తిగా ప్రాజెక్ట్ దెబ్బతింది. ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అయ్యాయి.. వీటిపై సమాధానాలు చెప్పలేక, సభకు రాకుండా కేసీఆర్ ఉంటున్నారు. చర్చకు సిద్ధమైతే కేసీఆర్ ను పిలవండి. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరంపై చర్చ చేయడానికి సిద్ధం. ప్రతిపక్ష బాధ్యతలను తప్పించుకునేందుకు ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. కేసీఆర్ ను చంపాల్సిన అవసరం ఎవరికి లేదు. చచ్చిన పామును చంపాల్సిన అవసరం మాకు లేదు. సానుభూతి కోసం వీల్ చైర్, వీధి నాటకాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పారు.

Updated On 14 Feb 2024 2:00 AM GMT
Yagnik

Yagnik

Next Story