తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగించారు.

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి అవుతుందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తన ప్రసంగంలో చెప్పారు. వరి రైతులకు రూ. 500 పంట బోనస్‌ ఇస్తున్నామని.. మహాలక్ష్మి స్కీమ్‌(Mahalaxmi Scheme) కింద మహిళలకు ఉచిత బస్సు(Free Bus), రూ. 500 కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ. 25 వేల కోట్ల రుణ మాఫీ చేశామని చెప్పారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. కాగా, గవర్నర్‌ ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు(BRS MLAs) అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా నీటిలో తెలంగాణ(Telangana) వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పించడంపై బీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగంలో అన్ని అబద్ధాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రుణ మాఫీ, రైతు భరోసా, వరికి రూ.500 బోనస్‌ ఇవ్వలేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణ మాఫీ చేయాలని, పంట బోనస్‌ ఇవ్వాలని పట్టుబట్టారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది.

ehatv

ehatv

Next Story