తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారట తీగల కృష్ణారెడ్డి. త్వరలో టీడీపీలో చేరి, ఆ బృహత్కర కార్యక్రమాన్ని భుజనా వేసుకుంటానని చెబుతున్నారాయన!

తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారట తీగల కృష్ణారెడ్డి. త్వరలో టీడీపీలో చేరి, ఆ బృహత్కర కార్యక్రమాన్ని భుజనా వేసుకుంటానని చెబుతున్నారాయన! ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును(CM Chandra Babu Naidu) కలుసుకున్నారు. తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy ) రాజకీయం మొదలయ్యిందే తెలుగుదేశంపార్టీతో! ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా కూడా పని చేశారు. చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మళ్లీ ఎన్టీఆర్‌(NTR) పాలన రావాలన్నారు. హైదరాబాద్‌(Hyderabad) చంద్రబాబు వల్లే అభివృద్ధి చెందిందనే పాత అరిగిపోయిన రికార్డును మళ్లీ వేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌, హుస్సేన్‌ సాగర్‌, సైబరాబాద్‌లను ఆయనే నిర్మించారని, అందుకు తానే సాక్షినని చెప్పారు. తెలంగాణలో తనలాంటి టీడీపీ(TDP) అభిమానులు బొచ్చెడు మంది ఉన్నారన్నారు. ఇంతకు ముందు తెలంగాణ తెలుగుదేశంపార్టీకి అధ్యక్షులుగా ఉన్న బక్కని నరసింహులు(Bakkani Narasimhulu) కూడా టీ- టీడీపీకి పునర్‌వైభవాన్ని తీసుకొస్తానని ప్రతిన చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని కూడా చెప్పారు. తర్వాత ఏమైందో మనకు తెలుసు. బక్కని తర్వాత ఆ పార్టీ బరువు బాధ్యతలను మోసిన కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా ఇలాంటి భారీ డైలాగులే కొట్టారు. పాపం ఆయన కూడా అంపశయ్య మీద ఉన్న టీడీపీకి ఊపిరిలూదడం తన వల్ల కాదనుకునేసి బీఆర్‌ఎస్‌(BRS)లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మూడో కృష్ణుడిగా తీగల కృష్ణారెడ్డి తెరమీదకు వచ్చారు. ఈయన సారథ్యంలో టీడీపీ దశతిరుగుతుందో లేదో చూడాలి.

ehatv

ehatv

Next Story