బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) రేవంత్‌రెడ్డినే అవ్వొచ్చు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. బుధవారం కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో(Karimnagar Parliamentary Social media warriors meeting) పాల్గొని మాట్లాడారు. బీజేపీ(BJP)-కాంగ్రెస్(congress) ఒప్పందంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చాయని అన్నారు.
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) రేవంత్‌రెడ్డినే(Revanth reddy) అవ్వొచ్చు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. బుధవారం కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో(Karimnagar Parliamentary Social media warriors meeting) పాల్గొని మాట్లాడారు. బీజేపీ(BJP)-కాంగ్రెస్(congress) ఒప్పందంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చాయని అన్నారు. అయితే.. బీజేపీని ఓడించే సత్తా బీఆర్ఎస్కు మాత్రమే ఉందని తెలిపారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి గురించి డీలాపడిపోవాల్సిన అవసరం లేదంటూ నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. చాలా చోట్ల బీఆర్ఎస్‌పై గెల్చిన ఎమ్మెల్యేలపై కేవలం నాలుగైదుసార్లు ఓడిపోయిన సానుభూతితో మాత్రమే గెలిచారని అన్నారు. అయినా.. బీఆర్ఎస్కు ప్రజలు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. చాలా చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వల్ప మెజార్టీతో ఓడియారని అన్నారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఉద్యమ నేత కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లదని తెలిపారు. 2009లో అల్గనూరులో అగ్గిపుట్టించి తెలంగాణ రావడానికి కరీంనగర్ గడ్డ కారణమైందని చెప్పారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని, సోనియా కడుతుందని చెప్పిన రేవంతే..ఇప్పుడు మాట మార్చారని అన్నారు. వంద అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయాలంటారు.. అలా అబద్ధాలు చెప్పి రేవంత్ సీఎం, కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారని సెటైర్లు విసిరారు. రైతుబంధు పడలేదంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుతో కొడతానన్నాడు. మరి.. రైతుబంధురాని రైతులు వారిని చెప్పుతో కొట్టాలా? లేదా ఓటుతో కొట్టాలా అనేది ఆలోచన చేయాలని అన్నారు.