మాజీ ఎమ్మెల్యేపై దాడి

సూర్యాపేట(Suryapet) జిల్లాలో కాంగ్రెస్‌(congress) ముసుగేసుకున్న గుండాలు రెచ్చిపోయారు. తిరుమలగిరి(tirumlagiri) పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రుణమాఫీ(Runmafi) చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగిన బీఆర్‌ఎస్‌(BRS) కార్యకర్తలు, నాయకులపై వారు దాడికి దిగారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌(Kishore) కారు అద్దాలు ధ్వంసం చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. రుణమాఫీ అరకొరగా చేసి తెగ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని, రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అన్ని మండల కేంద్రాల్లో రైతుల కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుం టున్నప్పటికీ.. నిరసన కొనసాగిస్తున్నారు. మరోవైపు తిరుమలగిరిలో బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి చేసిన నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న మాజీ మంత్రి ,సూర్యాపేట MLA జగదీష్ రెడ్డిని(Jagadish reddy) తిమ్మాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story