మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadeesh Reddy)ప్రభుత్వంపై మరోసారి విరుచకుపడ్డారు.

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadeesh Reddy)ప్రభుత్వంపై మరోసారి విరుచకుపడ్డారు. కృష్ణా(Krishna), గోదావరి(Godhavari)నదుల నీళ్లు పొయ్యి సముద్రంలో కలుస్తుంటే సర్కార్‌కు(Government)సోయి కూడా లేదని జగదీష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత 8 నెలలుగా తెలంగాణ(Telangana)లో పరిపాలన పడకేసిందని.. ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యంగా సాగునీటి రంగంలో ఘోరంగా ప్రభుత్వం విఫలమైందని, గత యాసంగి పంటకు నీళ్లు ఇవ్వలేకపోయిందని, కేసీఆర్ పాలనలో యాసంగిలోనే భారీగా దిగుబడి వచ్చిందని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు లక్షలాది టీఎంసీల(TMC) నీరు వృధాగా సముద్రం పాలవుతోందని, ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు నింపే అవకాశం ఉన్నాకానీ ఈ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తాయన్న సమాచారం ఉంది.. అయినా ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదు. మహబూబ్‌నగర్(Mahabub Nagar), నల్గొండ(Nalgonda)జిల్లాల్లో వర్షాభావం కారణంగా కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయని జగదీష్‌రెడ్డి మీడియాతో అన్నారు. నాగార్జున సాగర్(Nagarjuna Sagar) ఎడమ కాలువ(Left Canal)కు నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలని, ఖమ్మం(Khammam)జిల్లా పాలేరు(Palair)కూడా ఖాళీగా ఉంది. ఆ రిజర్వాయర్ సహా దాని కింద ఉన్న చెరువులు నింపాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా నది నీటిని కిందికి వదిలి సముద్రం పాలు చేస్తున్నారని, కాళేశ్వరం(Kaleshwaram)మోటర్లతో నీటిని ఎత్తిపోసి సూర్యాపేట(SuryaPeta) వరకు నీటిని తీసుకురావాలన్నారు. ఎస్సారెస్పీ (SRSP)ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు, మరి ఎస్సారెస్పీ నుంచి ఎందుకు సూర్యాపేటకు ఇవ్వడం లేదని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. సుందిళ్ల(Sundilla),అన్నారం బ్యారేజీల(annaram barrage)ను వెంటనే రన్నింగ్‌లోకి తీసుకొచ్చి సూర్యాపేట వరకు నీరందించాలని డిమాండ్ చేశారు జగదీష్‌రెడ్డి

ehatv

ehatv

Next Story