అసెంబ్లీ సమావేశాలు(TS assembly) జరుగుతున్నతీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(Jagadish reddy) మండిపడ్డారు

అసెంబ్లీ సమావేశాలు(TS assembly) జరుగుతున్నతీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(Jagadish reddy) మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మంచి పరిణామం. కేసీఆర్(KCR) సీఎం అయ్యాక అసెంబ్లీలో ఎస్సి వర్గీకరణకు(SC Classification) అనుకూలంగా తీర్మానం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం అమరులు అయిన కుటుంబాలను కేసీఆర్ ఆదుకున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన వారికి ధన్యవాదాలని జగదీష్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో దుశ్శాసనపర్వం నడుస్తోంది. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా దాడి చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై అనుచితంగా మాట్లాడారు.

బయట జరుగుతున్న సంఘటనలకు, అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి(Revanth reddy) మాట్లాడిన మాటలకు తేడా లేదు. భట్టి(Bhatti vikramarka) తనకు రేవంత్‌రెడ్డిపై ఉన్న కోపాన్ని సబితా ఇంద్రారెడ్డిపై(Sabitha indra reddy) చూయించారు. భట్టికి ఎప్పుడో ప్రతిపక్ష హోదా పోయిందని ఇప్పుడు భాదపడుతున్నారని జగదీష్‌రెడ్డి విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న శాంతిభద్రతలపై మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారిందన్నారు. నిన్నటి నుంచి సబితా ఇంద్రారెడ్డికి అసెంబ్లీలో రెండు నిమిషాలు అవకాశం ఎందుకు ఇవ్వలేదని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను సరిగా పని చేయనివ్వడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల బంధువుల పాత్ర ఉందని జగదీష్‌రెడ్డి విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డిని చూసి వణుకుతున్న అధికార పక్షానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్నారు. సబితక్కకు అసెంబ్లీలో రెండు నిమిషాలు అవకాశం ఇవ్వని వీళ్లకు కేసీఆర్ ఎందుకు అని ప్రశ్నించారు. సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరితే సభా సమయం వృధా అవుతుందని అంటున్నారు. కనీసం సీఎం రేవంత్‌రెడ్డికి తాను సోయి కూడా లేదు. మహిళలకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా చేశారు

అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడకుండా 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామో ప్రజలు అనుకుంటున్నారని జగదీష్‌రెడ్డి అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం ఏలాలని చూస్తున్నారని.. సభలో లేని వారిపై స్పీకర్ అనుమతి తీసుకుని మాట్లాడాలని.. కానీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. తమ బండారం బట్టబయలు అవుతుందని ప్రభుత్వం భయపడుతోంది

సీఎం ప్రవర్తనతో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో లాఅండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారం తగ్గించుకోవాలి, అసెంబ్లీ పట్ల ప్రజల్లో గౌరవం తగ్గే విధంగా వ్యవహరించవద్దని చెప్పారు.

సీఎం ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడారా, నేను సబ్జెక్ట్ మాట్లాడితే నాపై సీఎం వ్యక్తిగత ఆరోపణలు చేశారు. సభకు తాగివచ్చే వారితో నన్ను తిట్టించారని జగదీష్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము,ధైర్యం వుంటే సబితకు మైక్ ఇవ్వాలని తెలిపారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్ని తప్పులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం లక్షన్నర రుణమాఫీ చేస్తే 11 వేల కోట్లు కాలేదు, అదొక రుణమాఫీనేనా అని జగదీష్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారని.. లక్షల కోట్లు రుణాలు తీసుకున్న బ్యాంకు దొంగలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నారని జగదీష్‌రెడ్డి విమర్శించారు. మేం ఒక్కరం మాట్లాడితే ప్రభుత్వం నుంచి ఐదారుగురు లేసి మాపై దాడులు చేస్తున్నారు. అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడించకపోయినా ప్రజాక్షేత్రంలో మాట్లాడతామని జగదీష్‌రెడ్డి చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story