ఆలిండియా సివిల్ సర్వీస్‌కు(Civil service Exam) ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును(Harish Rao) కలిశారు. తమను ప్రోత్సహించినందుకు విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు అభినందనలు తెలిపిన హరీశ్‌రావు, దేశానికి సేవ చేసేందుకు దక్కిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పేద ప్రజలకు అండగా నిలవాలని వారిని కోరారు.
ఆలిండియా సివిల్ సర్వీస్‌కు(Civil service Exam) ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును(Harish Rao) కలిశారు. తమను ప్రోత్సహించినందుకు విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు అభినందనలు తెలిపిన హరీశ్‌రావు, దేశానికి సేవ చేసేందుకు దక్కిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పేద ప్రజలకు అండగా నిలవాలని వారిని కోరారు. వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూ, మరింత మంది యువతీయువకులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. మంచి పనీతీరుతో, సామాజిక సేవతో మీ తల్లిదండ్రులకు, తెలంగాణకు పేరు తేవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల యువతీయువకులకు సివిల్స్ పరీక్షల్లో అత్యుత్తమ శిక్షణ ఇస్తూ ఐఏఎస్‌లను(IAS) తయారుచేస్తున్న సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ(CSB IAS Acadamy) నిర్వాహకురాలు బాలలత(Balalatha) గారిని హరీష్ రావు ఈ సందర్భంగా సన్మానించారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రతియేటా సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికై ఇంటర్వ్యూకు వెళ్లే విద్యార్థులకు గైడెన్స్ ఇస్తుంటారు. ప్రభుత్వ పాలన, రాజకీయాలు, సామాజిక అబివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ వారి విజయానికి దోహదపడుతుంటారు.