ఇచ్చిన హామీల అమలుపై మాటమార్చడమన్నది కాంగ్రెస్‌కు(Congress) కొత్తేమీ కాదని, అది కాంగ్రెస్‌కు అలవాటేనని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. అధికారంలోకి రాగానే ఎల్‌ఆర్‌ఎస్(LRS) రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాటమార్చేసిందని ఆయన అన్నారు.

Harish Rao
ఇచ్చిన హామీల అమలుపై మాటమార్చడమన్నది కాంగ్రెస్‌కు(Congress) కొత్తేమీ కాదని, అది కాంగ్రెస్‌కు అలవాటేనని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. అధికారంలోకి రాగానే ఎల్‌ఆర్‌ఎస్(LRS) రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాటమార్చేసిందని ఆయన అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్ పేరిట రుసుము వసూలు చేయడానికి రెడీ అయ్యిందని చెప్పారు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అంటూ గతం లో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్ఆర్ఎస్ కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని హరీశ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతం లో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు చెప్పారు.
