అనర్హత పిటిషన్‌లపై(MLA Disqualification) తెలంగాణ హైకోర్టు(TS High Court) ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీఆర్‌ఎస్‌

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై(MLA Disqualification) తెలంగాణ హైకోర్టు(TS High Court) ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీఆర్‌ఎస్‌(BRS) సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు(Bangaru). ఎమ్మెల్యేల అన‌ర్హ‌త అప్లికేష‌న్ల‌పై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ(Congress) అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమన్నారు హరీశ్‌రావు.

తెలంగాణ హైకోర్డు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిల‌బెట్టే విధంగా ఉందని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం తప్పనిసరి అని హరీశ్‌రావు ఎక్స్‌లో ఓ ట్వీట్‌ చేశారు. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచి తీరుతుందన్నారు. హైకోర్డు తీర్పు కు అనుగుణంగా రాష్ట్ర శాస‌న‌స‌భాప‌తి నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు.


Eha Tv

Eha Tv

Next Story