అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్(KCR) ఛాంబర్‌ను రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ప్రభుత్వం మార్చేసింది. ప్రతిపక్ష నేతకు ఏళ్లుగా కేటాయిస్తున్నకార్యాలయం కాకుండా చిన్నగదిని కేటాయించిన రేవంత్ సర్కార్. కేసీఆర్‌కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని మొదటి ఆసెంబ్లీ సమావేశాల్లో కేటాయించింది.
అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్(KCR) ఛాంబర్‌ను(Chamber) రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ప్రభుత్వం మార్చేసింది. ప్రతిపక్ష నేతకు ఏళ్లుగా కేటాయిస్తున్నకార్యాలయం కాకుండా చిన్నగదిని కేటాయించిన రేవంత్ సర్కార్. కేసీఆర్‌కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని మొదటి ఆసెంబ్లీ సమావేశాల్లో కేటాయించింది. అయితే రెండో సమావేశాల్లోపే చాంబర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చివేసింది. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడంపై మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాగణంలో నిరసన చేపట్టారు. ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఎమ్మెల్యేలు కలిశారు.