తెలంగాణ(Telangana) ప్రజలు విస్పష్టమైన తీర్పు చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వాన్ని గద్దె దించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌(congress) పార్టీకి పట్టం కట్టారు. స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్‌ దూసుకుపోతున్నది.

తెలంగాణ(Telangana) ప్రజలు విస్పష్టమైన తీర్పు చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వాన్ని గద్దె దించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌(congress) పార్టీకి పట్టం కట్టారు. స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్‌ దూసుకుపోతున్నది. హైదరాబాద్‌(Hyderabad), రంగారెడ్డి(Rangareddy), మెదక్‌(Medak) జిల్లాలలో మాత్రమే బీఆర్‌ఎస్‌(BRS) ఆధిక్యత కనబరుస్తున్నది. మిగతా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ గాలే వీస్తున్నది. నల్లొండ, ఖమ్మం, వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ అధిపత్యం కనిపిస్తోంది. గజ్వేల్‌(Gajwel) నుంచి పోటీ చేసిన కేసీఆర్‌కు(KCR) పెద్ద మెజారిటీ రాకపోవడం, కామరెడ్డిలో(Kamareddy) ఓటమి దిశలో వెళుతుండటం విశేషం. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) రెండు చోట్లా సత్తా చూపుతుంటే, బీజేపీ(BJP) నాయకుడు ఈటల రాజేందర్‌కు(Etala Rajendra) మాత్రం రెండు చోట్లా ఎదురుదెబ్బ తగులుతోంది. మొత్తం మీద తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారన్నది అర్థమవుతోంది.

Updated On 3 Dec 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story