తెలంగాణ(Telangana) దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణా రన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) స్టెప్పులతో దుమ్మురేపారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2కే, 5కే రన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల(Chengicherla) చౌరస్తాలో నిర్వహించిన 5కే రన్ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ(Telangana) దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణా రన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) స్టెప్పులతో దుమ్మురేపారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2కే, 5కే రన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల(Chengicherla) చౌరస్తాలో నిర్వహించిన 5కే రన్ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తన డ్యాన్సులతో కార్యక్రమానికి హాజరైన యువతలో జోష్ నింపారు. డీజే టిల్లు(DJ Tillu) పాటకు కాలు కదుపుతూ హడావుడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ లోని అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ పాటకు కూడా మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు.