మంత్రి కేటీఆర్(KTR) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి(Delhi) వెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్రంలోని పెద్దలను కలిసి చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పలువురు కేంద్ర మంత్రులను(Central minister) కలువనున్నారు.

KTR TO DELHI
మంత్రి కేటీఆర్(KTR) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి(Delhi) వెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్రంలోని పెద్దలను కలిసి చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పలువురు కేంద్ర మంత్రులను(Central minister) కలువనున్నారు. ఢిల్లీలో మొదట ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో(Defense Minister Rajnath Singh) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్(traffic) నిర్వహణకు చేపట్టిన ఎస్సార్డీపీలో భాగంగా తలపెట్టిన స్కైవేల(Skyway) నిర్మాణం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు(Cantonment lands) ఇవ్వాల్సిందిగా మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్నేండ్లుగా కేంద్రం, రాష్ట్రం మధ్య చర్చలు జరుగుతున్నాయి.
అనంతరం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను(amit shah) కలిసే అవకాశం ఉంది. భేటీలో భాగంగా రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు హోంశాఖ పరిధిలోని భూముల అవసరం ఉన్నది. ఇందుకు అవసరమైన సహకారంపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ అంశంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేదా వీకే సింగ్‌తో సమావేశమై, స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పురీతో కూడా కేటీఆర్ సమావేశం కానున్నారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలను కేటీఆర్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై తేల్చాలని మంత్రిని కేటీఆర్ కోరనున్నారు.
