ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు(Lt Governor of Delhi) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), మంత్రి కేటీఆర్‌పై(KTR) ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) సంచలన లేఖ రాశాడు. నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని లేఖలో వెల్లడించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కవితకు వ్యతిరేకంగా ఈడీ కి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారని..

KTR To Take Legal Action
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు(Lt Governor of Delhi) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), మంత్రి కేటీఆర్‌పై(KTR) ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) సంచలన లేఖ రాశాడు. నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని లేఖలో వెల్లడించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కవితకు వ్యతిరేకంగా ఈడీ కి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారని.. ఆధారాలు ఇస్తే 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారని లేఖలో పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 2000 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయని వెల్లడించినట్లు తెలుస్తోంది.
కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందని.. ఆ ఆధారాలన్ని ఇప్పటికే ఈడీకి(ED) 65 -బి సర్టిఫికెట్(65-B Certificate) రూపంలో ఇచ్చేశానని లేఖలో వెల్లడించినట్లు సుఖేష్ లేఖలో పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని.. అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశానని.. ఈ అంశాల పై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు సుఖేష్ లేఖలో(Letter) వెల్లడించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నేరస్తుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు.. మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. సుఖేష్ అనే వాడి గురించి నేనెప్పుడూ వినలేదు. వాడెవడో కూడా నాకు తెలియదని స్పష్టం చేశారు. సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. సుఖేష్ లాంటి నేరస్తుడు.. మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని కేటీఆర్ మీడియాకి విజ్ఞప్తి చేశారు.
