టీపీసీసీ(TPCC) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉచిత విద్యుత్‌(Free Current) వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్(BRS) శ్రేణులు రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. పార్టీ శ్రేణులు, నాయ‌క‌త్వం బ‌హిరంగంగా, సోష‌ల్ మీడియా వేదిక‌గా కాంగ్రెస్‌(Congress), రేవంత్‌ల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా వ‌రుస ట్వీట్‌లు చేస్తున్నారు.

టీపీసీసీ(TPCC) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉచిత విద్యుత్‌(Free Current) వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్(BRS) శ్రేణులు రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. పార్టీ శ్రేణులు, నాయ‌క‌త్వం బ‌హిరంగంగా, సోష‌ల్ మీడియా వేదిక‌గా కాంగ్రెస్‌(Congress), రేవంత్‌ల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా వ‌రుస ట్వీట్‌లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సందిస్తున్నారు.

కేటీఆర్(KTR Twitter) ట్విట‌ర్‌లో.. కేసీఅర్ నినాదం మూడు పంటలు.. కాంగ్రెస్ విధానం మూడు గంటలు.. బీజేపీ విధానం మతం పేరిట మంటలు.. మూడు పంటలు(Mudu Pantalu) కావాలా.. మూడు గంటలు(Mudu Gantalu) కావాలా.. మతం పేరిట మంటలు(Mantalu) కావాలా.. తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన.. తరుణం ఇది.. అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు మంట‌లు పుట్టిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ ల‌ను టార్గెట్ చేస్తూ కేటీఆర్‌ చేసిన ఈ ట్వీట్ వైర‌ల్ అయ్యింది.

మ‌రో ట్వీట్‌లో.. కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. కాంగ్రెస్ వస్తే.. నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు
నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు.. నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు.. నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్నకారు రైతులు అంటే చిన్న చూపు .. సన్నకారు రైతు అంటే సవతి ప్రేమ.. నాడు ఏడు గంటల కరెంట్‌ ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్‌.. నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోంది.. మూడు గంటలతో మూడెకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు . బాహుబలి మోటార్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే.. రైతుల బతుకు ఆగం.. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం.. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం.. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్‌ కావాలా.? మూడు గంటల కరెంట్‌ చాలన్న మోసకారి రాబందు కావాలో నిర్ణయించుకోండి అంటూ కేటీఆర్ కాంగ్రెస్ తీరును ఎండ‌గ‌ట్టారు.

Updated On 12 July 2023 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story