నేడు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు సోలాపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర లోని సోలాపూర్ లో పద్మశాలీల ఆరాధ్య దైవం మార్కండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది.

BRS leaders visit Solapur today under the leadership of Minister Harish Rao
నేడు మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) సోలాపూర్(Solapur) పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర(Maharashtra) లోని సోలాపూర్ లో పద్మశాలీల ఆరాధ్య దైవం మార్కండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ(Telangana) నుంచి షోలాపూర్ లో స్థిరపడిన వేలాది మంది పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగనున్న ఈ రథోత్సవ కార్యక్రమంలో రాష్ట్రం తరఫున మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(KCR) ఆదేశాలమేరకు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో హోం మంత్రి మహమూద్ అలీ(Mohammad Ali), ఎమ్మెల్సీ ఎల్ రమణ(MLC Ramana), మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంచార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు(Kalvakuntla Vamshidhar Rao) తదితరులు హాజరుకానున్నారు. అనంతరం షోలాపూర్ లో త్వరలో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల పరిశీలన చేయనున్నారు.
