తెలంగాణ ప్రజలకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు,జైళ్లు కొత్త కాదని రాష్ట్ర విద్య శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బిజెపి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు శాసనమండలి సభ్యురాలు, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఈడి ఇచ్చిన నోటీసులపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

తెలంగాణ ప్రజలకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు,జైళ్లు కొత్త కాదని రాష్ట్ర విద్య శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బిజెపి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు శాసనమండలి సభ్యురాలు, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఈడి ఇచ్చిన నోటీసులపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. లిక్కర్ స్కామ్ అనేది బూటకమని బిజెపి వ్యూహం లో భాగమన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్ర పూరితంగా సిబిఐ, ఈడిలను పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని వ్యాఖ్యానించారు. దేశంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గాలలో భాగమే కవితకు ఈడి నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ప్రజల కోసం పనిచేసేవారికి ఇవి తప్పవు అన్నారు. 2001 లో రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలు పెట్టిన రోజున కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

ఢిల్లీలో ఆప్, తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలో భాగమే ఈ నోటీసుల బాగోతం అన్నారు. దేశంలో బిఆర్ఎస్ పార్టీ వ్యాప్తిని నిలవరించడానికి, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే మోడీ ఈడిలను పంపిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన మడమతిప్పని పోరాటం యావత్ దేశ ప్రజలకు తెలుసని బిజెపి నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. చరిత్రలో నియంతలు ఎప్పుడు దీర్ఘకాలం ఉండలేరన్నారు. మోడీ దుర్మార్గాలకు కాలం చెల్లిందన్నారు. బిజెపి సర్కార్ ను గద్దె దింపే వరకు పోరాటం మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

Updated On 8 March 2023 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story